Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Blogger Widgets Blogger Widgets

Wednesday, July 10, 2013

వైజయంతీ విలాసం (విప్రనారాయణ చరిత్ర)



వైజయంతీ విలాసం

 (విప్రనారాయణ చరిత్ర)

                           సారంగు తమ్మయ



  •   సారంగు తమ్మయ క్రీ.శ. ౧౬౦౦ ల ప్రాంతం వాడు.
  •   ఆళ్వారుల చరిత్ర ఆంధ్ర దేశంలో పరమయోగి విలాసము అను పేర గలదు. తాళ్ళపాక చిన్నన్న ద్విపదలో దీన్ని రాశాడు.
  •   నారాయణుడు అను వైష్ణవ బ్రాహ్మణుడి భార్య లక్ష్మికి వైజయంతి మాలను కళలో ఇస్తుంది. ఈ వైజయంతి మాల వలన పుట్టిన వాడే విప్రనారాయణుడు.
  •   మధురవాణి, దేవదేవి వారాంగనలు.
ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
అవతారిక
౪౨ గద్య పద్యాలు ( 42 )
ప్రథమాశ్వాసం
౯౬ గద్య పద్యాలు ( 96 )
ద్వితీయాశ్వాసం
౧౫౨ గద్య పద్యాలు ( 152 )
తృతీయాశ్వాసం
౧౪౦ గద్య పద్యాలు ( 140 )
చతుర్థాశ్వాసం
౧౪౦ గద్య పద్యాలు ( 140 )
మొత్తం = ఆశ్వాసాలు ( 4 )
మొత్తం = ౫౭౦ పద్యాలు ( 570 )






తొలి పద్యం

ఉత్పలమాల.



 శ్రీ వసుధా సుతాంఘ్రి వివరింప శిరీష దళోపమాన, మీ
       క్ష్మాదరు కేల్ నిసర్గ గుణ ర్కశ, మశ్మము మెట్టఁ బల్కె నె
            ట్లీ వసుధా వరుం, డనుచు నింతులు వల్కగ నంటఁ గొంచు లో
          కావనుఁ డైన పెండ్లికొడు స్మ దభీప్సితముల్ ఘటించుతన్.”





చివరి పద్యం

సుగంధి.

  

     పాద పాంసు పాలి తాక్షపాద దార వేదనా !
        వేదనా తదీయతాభి వేద్య భృత్సనాదితా !
       నాది తాంగ జారి చాప నాధవేది జాలకా !
          వేది జాల కాంక్షి తాభి వృద్ధ కల్ప పాదపా !.”




Monday, July 1, 2013

శ్రీకృష్ణదేవరాయల పద్యం

శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కీర్తిస్తూ చెప్పిన పద్యం:

"తెలుగ దేల యన్న దేశంబు తెలు గేను
 తెలుగు వల్లభుండ తెలుగొ కండ
 ఎల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి
దేశ భాశ లందు తెలుగు లెస్స".

Friday, June 28, 2013

రాధికాస్వాంతనము




రాధికాస్వాంతనము

                           ముద్దు పళని










  •      శ్రీనాథుని కాలాని కంటే ముందు రాధ ప్రసక్తి తెలుగు సాహిత్యంలో లేదు.
  •     శ్రీనాథుడు తొలిసారిగా భీమఖండం అవతారికలో ఇష్టదేవతలను ప్రార్ధిస్తూ రాధామాధవులను ప్రస్తావించాడు.
  •     రాధికాస్వాంతనమునకు ఇళాదేవీయమని మరొక పేరు కలదు.
  •     రాధ చెప్పుచేతల్లో ఇళ పెరుగుతుంది.
  •      ఈ ప్రబంధంలో రాధ కృష్ణుడికి చిలుక రాయాబారం పంపుతుంది.

ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
ప్రథమాశ్వాసం
౧౧౧ గద్య పద్యాలు ( 111)
ద్వితీయాశ్వాసం
౧౪౭ గద్య పద్యాలు ( 147)
తృతీయాశ్వాసం
౧౭౧ గద్య పద్యాలు ( 171)
చతుర్థాశ్వాసం
౧౧౩ గద్య పద్యాలు ( 113)
మొత్తం = ౪ ఆశ్వాసాలు ( 4)
మొత్తం = ౫౪౨ పద్యాలు ( 542)



తొలి పద్యం

ఉత్పలమాల (ఇష్ట దేవతా స్తుతి)



 “ శ్రీలఁ జెలంగు రాధికనుజెల్వరొ! నిన్నిల రూప రేఖలన్
      బోలుదురే పడంతు?’ లనమోహపురాలిని నిప్పుడెన్నెదో
          హాళిని నన్నుఁ గూర్చియని ల్గిన యిచ్చెలిఁ గౌగిలించు గో
 పాలుని, జిన్ని కృష్ణుని, గృపాశుని గొల్తు నభీష్ట సిద్ధికై.”





చివరి పద్యం

మత్తకోకిల.



 నాగ పాలక ! నాగ దాలక ! నాగ ఫాలక వాహనా !
    వా గధీశ్వర ! వా గహీశ్వర ! వా గనశ్వర గాహనా !
        యోగ చారణ ! యోగ ధారణ ! యోగ కారణ ! సాహనా
     భోగ శోషణ ! భోగినీషణ ! భోగి భూషణ మోహనా ! ”