Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Blogger Widgets Blogger Widgets

Sunday, May 12, 2013

విజయ విలాసం


విజయ విలాసం
                     చేమకూర వేంకట కవి



  • చేమకూర వారి తండ్రి పేరు : - లక్ష్మన్న లేదా లక్ష్మణామాత్యుడు
  •   చేమకూర వారు సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ కవితా ధురంధరుడు.

  •   విజయ విలాసానికి పిల్ల వసుచరిత్రఅని పేరు.

  •   విజయ విలాసంలో కథానాయకుడు “అర్జునుడు”.

  •   ధర్మ రాజు : - ఇంద్రప్రస్థపుర రాజు.

  •    జయంతుడు : - ఇంద్రుని కుమారుడు.

  •   విశారదుడు : - అర్జునుని స్నేహితుడైన ధౌమ్యుని తమ్ముని కుమారుడు.

  •   ఈ ప్రబంధం రఘునాథ నాయకునికి అంకితంగా ఇవ్వబడినది.

  •  ఈ ప్రబంధంలో ౩ ఆశ్వాసాలున్నాయి.

అర్జునుడికి గల ౧౦ పేర్లు
   1.      అర్జునుడు,
   2.      ఫల్గునుడు,
   3.      పార్ధుడు,
   4.      కిరీటి,
   5.      శ్వేతవాహనుడు,
   6.      బీభత్సుడు,
   7.      విజయుడు,
   8.      కృష్ణుడు,
   9.      సవ్యసాచి,
   10.  ధనుంజయుడు.


అర్జునుడి భార్యలు
అర్జునుడి కుమారులు
ఉలూచి
( నాగ కన్య )
ఇలావంతుడు
( ఉలూచి కుమారుడు )
చిత్రాంగద
( మణిపుర రాజధాని అగు పాండ్యదేశ రాజు
మలధ్వజుని కూతురు )
భభ్రువాహనుడు
( చిత్రాంగద కుమారుడు )

సుభద్ర
( శ్రీ కృష్ణుని చెల్లి )
అభిమన్యుడు
( సుభద్ర కుమారుడు )


ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
అవతారిక
౬౫ గద్య పద్యాలు ( 65 )
ప్రథమాశ్వాసం
౧౬౩ గద్య పద్యాలు ( 163 )
ద్వితీయాశ్వాసం
౨౦౬ గద్య పద్యాలు ( 206 )
తృతీయాశ్వాసం
౨౩౯ గద్య పద్యాలు ( 239 )
మొత్తం = ౩ ఆశ్వాసాలు
మొత్తం = ౬౭౩ పద్యాలు ( 673 )




తొలి పద్యం


   శార్థూలం.


“ శ్రీ లెల్లప్పు డొసంగ, నీ సకల ధాత్రీ చక్రమున్ బాహు పీ
    ఠీ లగ్నంబుగఁ జేయ, దిగ్విజయ మీన్ డీకొన్న చందాన నే
       వేళన్ సీతయు, లక్ష్మణుండుఁ దను సేవింపంగ విల్ పూని చె
        ల్వౌ లీలన్ దగు రామమూర్తి రఘునా థాధీశ్వరుం బ్రోవుతన్”.





చంపకమాల.   (ప్రథమాశ్వాసంలోని ౨౭వ పద్యము(27))

    
    తని నుతింప శక్యమె జయంతుని తమ్ముడు సోయగమ్మునన్,
 తగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్,
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతి జోదు  సమిజ్జయమ్మునం,
తని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్”.
                                                                   

 





చివరి పద్యం


భుజంగ ప్రయాతము.
   
    “ అరాతీ క్షమాభృ ద్బిదాంచ త్కృపాణా !
రాధీశ్వ రాకార నాళీక బాణా !
     స్థిరానందనా ! రామ సేవా ధురీణా !
    విరాజ చ్చతుష్షష్టి విద్యా ప్రవీణా !”.