Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Blogger Widgets Blogger Widgets

Wednesday, April 24, 2013

ప్రభావతీ ప్రద్యుమ్నము



ప్రభావతీ ప్రద్యుమ్నము

                    పింగళి సూరన


  •  రుక్మిణీ కృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు.
  •  ప్రద్యుమ్నుడు పూర్వ జన్మలో మన్మథుడు.
  •  శుచిముకి ( హంస ) తండ్రి పేరు సారంధరుడు.
  •   వజ్రనాభుడన్న రాక్షసరాజు కూతురు "ప్రభావతి".
  •   వజ్రనాభుడి తమ్ముడైన సునాభుడి బిడ్డలుచంద్రవతి, గుణవతి
  •   చంద్రవతి, గుణవతుల ప్రియులు "గదుడు, సాంభుడు".
  •   వీరి రాయభారి చిలుక.
  •   ఈ ప్రబంధంలో మొత్తం ౫ (5) ఆశ్వాసాలు ఉన్నయి.
  •    ఈ ప్రబంధాన్ని తన తండ్రికి అంకితంగా ఇచ్చాడు.
ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
ప్రథమాశ్వాసం
౧౪౮ గద్య పద్యాలు ( 148 )
ద్వితీయాశ్వాసం
౧౧౩ గద్య పద్యాలు ( 113 )
తృతీయాశ్వాసం
౧౫౪ గద్య పద్యాలు ( 154 )
చతుర్థాశ్వాసం
౧౬౪ గద్య పద్యాలు ( 164 )
పంచమాశ్వాసం
౨౨౪ గద్య పద్యాలు ( 224 )
మొత్తం = ౫ ఆశ్వాసాలు ( 5 )
మొత్తం = ౮౦౩ పద్యాలు ( 803 )




తొలి పద్యం

ఉత్పలమాల.



 శ్రీమ దుమా మహేశు లతిచిత్ర విలాసులు తారు మున్ వియో
గామిత చింత నొండొరులకై సగ మౌటలు నిచ్చఁ దెల్పు కాం
క్ష మహిమంబుచేఁ జెటి సగంబుగ నొక్కయెడల్ ధరించు స
  త్ప్రే మపుదంపతుల్ కృతిపతిన్ దనరింతురు గాతఁ గీర్తులన్ “.





చివరి పద్యం

వనమయూరము.
       భ్రుత్యజన పోషణుడు పింగళి పురాంకా
             మాత్యకుల భూషణుడు, మార్దవ మహీయ
           స్సత్యశుచి భాషణుడు, సాధుజనతా సం
               త్యుదయ పోషణుడు వ్యకృప పేర్మిన్ “.